లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని.. విశాఖ జిల్లా పాయకరావు పేట భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నారాయణరావు కోరారు. మేడే సందర్భంగా ఆయన పట్టణంలో జెండా ఎగరవేశారు. కార్మికుల అవస్థపై... కార్మిక సంక్షేమ బోర్డు స్పందించి కుటుంబానికి రూ.10 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.