విశాఖ జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో... గ్రామానికి చెందిన జామి పోతురాజు పాడిగేదె గడ్డి మేస్తుంది. గడ్డి మేసి తిరిగి వెళ్తున్న సమయంలో పాఠశాల గేటు నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించి అందులో ఇరుక్కుపోయింది. స్థానికులు, రైతులు పాడిగేదెను బయటకు లాగడానికి గంటలు తరబడి ప్రయత్నించినా... ఫలితం లేకపోయింది. చేసేదేమిలేక వెల్డింగ్ యంత్రంతో గేట్‌ను కట్ చేసి అతికష్టం మీద గేటులో ఇరుక్కుపోయిన గేదెను బయటకు తీశారు.
ఇదీ చదవండి: