Buddha Chandrasekhar: అమృత్ 2.0 పథకం లక్ష్య సాధనకు తెలుగు రాష్ట్రాలల్లో నేషనల్ నోడల్ ఇంఛార్జ్‌గా డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ అదనపు బాధ్యతలు చేపట్టారు. అమృత్ 2.0 సాఫ్ట్వేర్ అప్లికేషన్ రూపొందించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐసీటీఈలో చీప్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ విధులు నిర్వర్తిస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన చంద్రశేఖర్.. భారతీయ మాతృభాషల సంరక్షణకు ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ కిట్ రూపకర్త. తెలుగు రాష్ట్రాలకు అధికారిగా రావడం గమనార్హం. 100 శాతం పట్టణ ప్రాంతాలను మంచినీరు అందించాలనే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే.. తెలుగురాష్ట్రాలల్లో అమృత్ 2.0 లక్ష్య సాధనకు నేషనల్ నోడల్ ఇంచార్జ్ ఆఫీసర్‌గా తెలుగు వ్యక్తిని ఎంపిక చేశారు.
100 శాతం పట్టణ మంచినీరు అందించాలనే
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి మంచినీరు(కుళాయి నీరు) అమృత్ 2.0 పథకం.. 2015లో మొదటి నీటి కేంద్రీకృత మిషన్‌గా ప్రారంభమైంది. 500 ప్రధాన నగరాలలో 60% మందికి ఉపయోగపడేలా రూ. లక్ష కోట్ల ఈ పథకాన్ని రూపొందించారు. ప్రాజెక్టు అమలు కోసం కేటాయించిన నిధుల కంటే ఎక్కువ విలువైన పనులు జరుగుతుండటం గమనార్హం. అమృత్ 2.0 పథకం ప్రకారం.. "మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని 'అభివృద్ధి చేయాలనే సంకల్పం'.. శుద్ధి చేసిన నీటిని సద్వినియోగం కోసం ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అమృత్ 2.0 లక్ష్యం 2.68 కోట్ల పట్టణ గృహాలకు కులాయి కనెక్షన్లు అందించడం. 100% యూఎల్బీలలోని అన్ని గ్రహాలకు నీటిని సరఫరా చేయడం. 100 శాతం పట్టణ ప్రాంతాలను మంచినీరు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదీ చదవండి..HC on Amaravathi: మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ ప్రారంభం