సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్న సంచయిత గజపతిరాజుపై... బీజేవైఎం విశాఖ సెక్రటరీ ఫణీంద్ర భూపతి గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవికి సంచయిత అర్హురాలు కాదని ఆరోపణలు చేశారు. రాత్రికి రాత్రి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని అందిపుచ్చుకున్నారని ఆరోపణలు చేశారు. సింహాచలం భూములు, సంపదపై ఎన్ని ఆరోపణలు వచ్చినా... పత్రికల్లో కథనాలు వచ్చినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తన వారసత్వంపై కోర్టులో కేసు నడుస్తుండగా పదవిని ఏ విధంగా కొనసాగిస్తారని... సంచయిత నిజంగా ఆనంద్ గజపతి వారసురాలు అయితే వెంటనే మీడియా ముందుకు వచ్చి తన వారసత్వాన్ని నిరూపించుకొని పదవిని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: