వైకాపా ప్రభుత్వంతో గుణాత్మక మార్పులు వస్తాయని భావించినా... 100 రోజుల పాలన చూస్తే ఏ పురోగతి సాధించిన దాఖలాలు లేవని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. విశాఖ భాజపా కార్యాలయంలో జన జాగరణ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మురళీధరరావు పాల్గొన్నారు. ప్రజాసమస్యలపై పోరాడడానికి రాష్ట్రంలో భాజపా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఈడీ, ఐటీ, ప్రభుత్వ శాఖలు చేసే సోదాలు, విచారణలకు భాజపాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. భాజపాలోకి వస్తే కేసులు నుంచి రక్షణ ఉంటుందని భ్రమపడేవారికి భంగపాటు ఖాయమని మురళీధరరావు హెచ్చరించారు. కేసులున్న వారు భాజపాలో చేరినంత మాత్రాన కమలదళ డీఎన్ఏ మారదని స్పష్టం చేశారు. భాజపాలో ఉన్న వారిపైనా సోదాలు, విచారణలు జరిగాయని గుర్తు చేశారు.
ఒకే దేశం..ఒకే చట్టం..ఒకే జెండా
సెప్టెంబర్ 1 నుంచి జాతీయ ఏకత అభ్యాన్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న మురళీధర్ రావు... దేశంలో 400 ప్రాంతాల్లో మేధావులతో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భాజపా వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయం.. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే జెండా సాకారం చేయడానికే 370 అధికరణను రద్దు చేసినట్టు తెలియజేశారు. ఈ అధికరణ వల్ల కశ్మీర్లో మహిళలకు, గిరిజనులకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపించారు. ఆ అన్యాయాన్ని భాజపా సరిచేసిందన్నారు.
ఇదీ చదవండి: