నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో భాజపా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 48వ వార్డు భాజపా కార్పొరేటర్ కవిత అప్పారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా హీ సంఘటన, సేవా కార్యక్రమాలలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇదీ చూడండి.12 ఏళ్లకే 'టోఫెల్' ఉత్తీర్ణత- కశ్మీర్ బాలిక ఘనత