2024లోనూ దేశంలో మళ్లీ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. 1981లో విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా పార్టీ తరఫును గెలిచిన వారిని.. విశాఖ తొలి మున్సిపల్ కార్పొరేషన్ మధుర స్మృతుల పేరిట సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు.. విశాఖలో భాజపాకు ఉన్న పూర్వ వైభవం తిరిగి రావాలని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో భాజపా, జనసేన కలిసి మార్పులు తీసుకువస్తాయని తెలిపారు. నేటి రాజకీయాల్లో విలువులున్న నాయకులు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఎంపీ విజయసాయిరెడ్డికి అనర్హత వర్తించదు: రాష్ట్రపతి