ETV Bharat / state

పోలీసులకు చిక్కిన దొంగ..130 వాహనాలు స్వాధీనం

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 130 ద్విచక్రవాహనాలను దొంగతనం చేసిన ఘరానా దొంగను ఎట్టకేలకు విశాఖ పోలీసులు పట్టుకున్నారు.

పోలీసులకు చిక్కిన బైకుల దొంగ
author img

By

Published : Sep 13, 2019, 11:38 AM IST

పోలీసులకు చిక్కిన బైకుల దొంగ
పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను కేవలం పది నిమిషాల్లో తస్కరించడం ఆ దొంగ ప్రత్యేకత. ఆరు సంవత్సరాల నుంచి బైక్​లను దొంగలిస్తున్నా పోలీసులకు పట్టుబడకుండా ఉన్నాడంటే చోరకళలో ఎంత సిద్ధహస్తుడో అర్థం చేసుకోవచ్చు. ఎంత నైపుణ్యం ఉన్నా.. ఎక్కడో ఒకచోట తప్పులు చేయక మానడు..పోలీసులకు చిక్కక మానడు. అటువంటి ఘరానా దొంగనే విశాఖ పోలీసులు అరెస్టు చేసి ఏకంగా 130 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 2013 నుంచి పార్క్ చేసి ఉంచిన హీరోహోండా బైక్​లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేసే వీరయ్య చౌదరి పోలీసులకు పెద్ద సవాల్​గా నిలిచాడు. ఎట్టకేలకు వీరయ్యను అరెస్టు చేసి 130 హీరోహోండా బైకులను, ద్విచక్ర వాహనాల విడి భాగాలను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ హార్డ్​వేర్ కంపెనీలో పని చేస్తూ కంప్యూటర్ దొంగతనం చేసి 2005లో అరెస్టై విడుదలైన వీరయ్య.. ద్విచక్ర వాహనాలను దొంగలించడం మెుదలు పెట్టాడని విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్​కే మీనా తెలిపారు. బైక్​లు పార్కింగ్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి : మత్తు పదార్ధాలతో వచ్చే సమస్యలపై కార్యశాల

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్..... జిల్లాలో ప్రభుత్వం నిర్వహించునున్న మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు సేల్స్మెన్, పర్యవేక్షకలకు నేడు గుంటూరు మండల కేంద్రంలో ఇంటర్వ్యూ లు నిర్వహించారు. మొత్తం134 బోర్డులు ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఎక్సైజ్ శాఖ డీసీ అదిశేషు తెలిపారు. 282 పర్యవేక్షకలకు, 371 సేల్స్ మెన్ లకు ముఖాముఖి నిర్వహించామన్నారు. ఒక్కకో పోస్టు కి 5 గురు ని పిలవడం జరిగిందన్నారు. వీరిలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించి అనంతరం వారికి సంబంధించిన దుకాణాలలో భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Body:బైట్....అదిశేషు, ఎక్సైజ్ శాఖ డీసీ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.