స్పీడ్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్కి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీని ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రారంభించారు. వాహనం నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలని, అమెరికా లాంటి దేశాలతో సరి చూసుకోకూడదని.. మన దేశ పరిస్థితులు దృష్టి లో పెట్టుకోవాలని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. బయటకు వెళ్లిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి రావాలి, సేఫ్ డ్రైవ్ చేయాలి, ఈవ్ టిజింగ్ వ్యతిరేకించాలన్నారు. ఈ ర్యాలీలో మంత్రులు కురసాల కన్నబాబు, మత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ, సినీ నటులు.. అలీ, ఖయ్యూమ్, తనీష్, అశు రెడ్డి, దీక్షా పంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జనసిరితో మురవనున్న తుంగభద్రమ్మ