విశాఖ గురజాడ కళాక్షేత్రంలో 'భీష్మ' చిత్రబృందం విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిత్ర కథానాయకుడు నితిన్ మాట్లాడుతూ... ఈ చిత్రం తన కెరీర్లో మలుపులాంటిందని, చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సినిమా విజయం సాధించినందుకు చిత్రబృందానికి హీరో వరుణ్ తేజ్ అభినందలు తెలియజేశారు. కార్యక్రమంలో కథానాయిక రష్మికతో పాటు చిత్ర పంపిణీదారులు పాల్గొన్నారు.