ఆమె ఓ బ్యాంకు ఉద్యోగిని. విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి పయనమైంది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటుదనే సమయంలో మృత్యువు... లారీ రూపంలో కబళించింది. ఈ ప్రమాదం విశాఖలో జరిగింది. మృతురాలు సీతమ్మధార హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పనిచేస్తున్న జయశ్రీరెడ్డిగా గుర్తించారు. జాతీయ రహదారి గురుద్వారా కూడలి వద్దకు వచ్చేసరికి స్కూటీని వెనక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావటంతో జయశ్రీరెడ్డి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
ఇవీ చదవండి