విశాఖ సాగర తీరంలోని తెన్నేటి పార్కు సమీపంలోకి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌక నుంచి ఇంధనం తీసివేసేందుకు నిపుణులు సన్నాహాలు ప్రారంభించారు. ముందుగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం సామాగ్రిని చేరవేసేందుకు వాహనం వెళ్లేలా జేసీబీతో పనులు చేయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో మునిగిన లాంచీని వెలికి తీసిన బృందం కూడా సహాయమందించేందుకు సిద్ధమైంది.
ఇదీ చదవండి: త్రీడీ వీడియోలు చూసిన అనుభవం రెండు ప్రాణాలను కాపాడింది