ETV Bharat / state

'పీడిత ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్' - మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తాజా వార్తలు

విశాఖలోని వైకాపా ప్రధాన కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నివాళి అర్పించారు. బాబూ జగ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకల్లో భాగంగా.. ఆయన సేవలను కొనియాడారు.

Babu Jagjivan Ram Jayanti
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
author img

By

Published : Apr 5, 2021, 2:48 PM IST

మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. వైకాపా ప్రధాన కార్యాలయంలోని బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పార్టీ కార్యకర్తలు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి సమాజంలోని పీడిత ప్రజల అభ్యున్నతికి విశేష కృషి చేసిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని మంత్రి తెలిపారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి:

మా ఇంటి బాధ్యతలా.. విశాఖ నగరానికి వన్నెలద్దుతాం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.