ETV Bharat / state

డాక్ యార్డు ఉద్యోగుల " ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ "

భార‌త స్వాతంత్ర దినోత్స‌వ 75 ఏళ్ల ఉత్స‌వాలు " ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ " సంద‌ర్భంగా 75 మంది విశాఖ నేవల్ డాక్ యార్డు ఉద్యోగులు ర్యాలీ చేప‌ట్టారు. కార్లు, మోటార్ సైకిళ్లల‌తో పురుషులు, సైకిళ్ల‌తో మ‌హిళ‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

డాక్ యార్డు ఉద్యోగుల " ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ "
డాక్ యార్డు ఉద్యోగుల " ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ "
author img

By

Published : Mar 31, 2021, 10:43 AM IST

వచ్చే ఏడాదికి దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్నందున " ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ " పేరిట జాతీయ స్థాయిలో ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా విశాఖలో 75 మంది నేవల్ డాక్ యార్డు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సుమారు 5 వేల కిలోమీట‌ర్ల దూరం సాగనున్న ఈ ర్యాలీని షిప్ బిల్డింగ్ కేంద్రం ప్రాజెక్టు డైరెక్ట‌ర్ వైస్ అడ్మిర‌ల్ కె.శ్రీ‌నివాస్ ప్రారంభించారు. దేశీయ ప‌రిశ్ర‌మ‌లు డాక్ యార్డుతో భాగ‌స్వాములుగా త‌మ సామ‌ర్ద్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న తీరును శ్రీనివాస్ తెలియజేశారు. 12 ప్ర‌ధాన న‌గ‌రాల్లో భార‌తీయ ప‌రిశ్ర‌మ‌ల‌ను సంద‌ర్శించడ‌మే కాకుండా దారి పొడవునా చిన్న మ‌ధ్య ‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌తో సంభాషించి ఆత్మ ‌నిర్భ‌ర్ భార‌త్​లో సాధించిన పురోగ‌తి గురించి యాత్రలో భాగంగా తెలుసుకోనున్నారు.

వచ్చే ఏడాది వరకు వజ్రోత్సవం..

మ‌హిళ‌లు నిర్వ‌హించే సైకిల్ ర్యాలీ, విశాఖ ఆట్​న‌గర్​లో ఉన్న చిన్న ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు, ప్ర‌తినిధుల‌తో మాట్లాడనున్నారు. దేశంలోని చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు డాక్ యార్డుతో క‌లిసి దేశీయంగా నౌక‌ల రిపేర్లు చేసే సామ‌ర్ధ్యం సాధించే తీరును వివ‌రించనున్నారు. వజ్రోత్సవ వేళ విశాఖ నేవ‌ల్ డాక్ యార్డు ఈ ఏడాది మార్చి 29 నుంచి సంవ‌త్స‌రం పాటు ఉత్స‌వాలు కొనసాగనున్నాయి.

ఇవీ చూడండి : మువ్వన్నెలు విరిసిన వేళ..శత వసంతాల హేల..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.