ETV Bharat / state

నేత్రదానంపై విశాఖలో అవగాహన ర్యాలీ

జాతీయ అంధత్వ నివారణ సంస్థ, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య కళాశాల ఆధ్వర్యంలో... విశాఖ బీచ్ రోడ్​లో నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర వైద్య కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖలో నేత్రదాన అవగాహన ర్యాలీ
author img

By

Published : Sep 8, 2019, 9:41 PM IST

విశాఖలో నేత్రదాన అవగాహన ర్యాలీ

34వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా... విశాఖ బీచ్ రోడ్​లో నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య కళాశాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని... కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్​ జెండా ఊపి ప్రారంభించారు. బీచ్ రోడ్ కాళీమాత ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ వైఎంసీఏ వరకు సాగింది. ప్లకార్డులు పట్టుకుని నేత్రదానం చేయాలంటూ వైద్య కళాశాల విద్యార్థులు నినదించారు. యువత నేత్రదానం చేయడంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

గ్రామీణ వైద్యులు సేవలు..మరువలేనివి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.