అరకులో కరోనా వైరస్‌పై అవగాహన - అరకులో కరోనా వైరస్‌పై అవగాహన
విశాఖ జిల్లా అరకు లోయలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై గురువారం అవగాహన కల్పించారు. అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. కరోనా వైరస్‌కు ముందు జాగ్రత్త చర్యగా మాస్కులు ధరించాలని సూచించారు. ఇతరులకు వైరస్ వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యురాలు వాణి అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మొద్దని.. వాటిని వ్యాప్తి చేయవద్దని సూచించారు.
Awareness programme on corona virus at Araku in visakhapatnam district