స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. గాజువాక కాకతీయ గేట్ నుంచి పాత గాజువాక వరకు పాదయాత్ర నిర్వహించారు. గాజువాక శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షాలు సంయుక్తంగా పాదయాత్ర చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలు, నిర్వాసిత సంఘాలు ఈ పాదయాత్రలో పాల్గొన్నాయి.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు. మేయర్ జీవి రమణ కుమారి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వినాయక మండపాలపై పెట్టిన శ్రద్ధ స్టీల్ ప్లాంట్ మీద పెట్టలేదని మంత్రి అన్నారు. తమ పోరాటంపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఆ బామ్మ వయసు 60 కాదండోయ్.. పదహారే!