ETV Bharat / state

'రైతే రాజు అన్న ధ్యేయంతో వైకాపా ఏడాది పాలన సాగింది'

రైతే రాజు అన్న ధ్యేయంతో తమ ప్రభుత్వ ఏడాది పాలన సాగిందని పర్యటక శాఖమంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులకు విత్తనాలు,ఎరువులతోపాటు సాంకేతికతను అందిస్తామన్నారు.

'రైతే రాజు అన్న ధ్యేయంతో వైకాపా ఏడాది పాలన సాగింది'
'రైతే రాజు అన్న ధ్యేయంతో వైకాపా ఏడాది పాలన సాగింది'
author img

By

Published : May 30, 2020, 10:40 PM IST

విశాఖ జిల్లా ఎస్. రాయవరం మండలం గుడివాడ గ్రామంలో రైతుభరోసా కేంద్రాన్ని పర్యటక శాఖమంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ప్రారంభిం చారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి అవంతి మాట్లాడుతూ.... రైతే రాజు అన్న ధ్యేయంతో తమ ప్రభుత్వ ఏడాది పాలన సాగిందన్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులకు విత్తనాలు,ఎరువులతోపాటు సాంకేతికతను అందిస్తామన్నారు.

దీంతోపాటు పండించిన పంటకు మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తామని మంత్రి అవంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు గొల్ల బాబూ రావు, కన్న బాబు రాజు, కలెక్టర్ వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.