విశాఖలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆటో డ్రైవర్లు తమ సేవాభావాన్ని చాటుకున్నారు. విశాలాక్షి నగర్, పైడిమాంబ ఆటో స్టాండ్ కార్మికులు నగరంలోని అన్నార్తులు, నిరాశ్రయులకు ఆహారాన్ని అందించారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ సమీపంలో నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చారు. పైడిమాంబ ఆటో డ్రైవర్లు సొంతంగా సొమ్ము వెచ్చించి మధ్యాహ్న భోజనం వండి, ప్యాకెట్ల రూపంలో అన్నార్తులకు సరఫరా చేశారు.
ఇది చదవండి పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ