మూడు నెలల కిందట విశాఖలో ఓ సంఘం ఏర్పాటైంది. దాని పేరు.. వృద్ధ కారుణ్య మరణార్థుల సంఘం. ఒకే భావజాలంతో ఉన్న ఆ వృద్ధులు.. ప్రభుత్వ అనుమతితో చనిపోవాలని అనుకుంటున్నారు. ప్రభుత్వం తమకు మరణం ప్రసాదించాలనే డిమాండ్ తో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటి వరకూ అందులో వంద మంది సభ్యులు కూడా ఉన్నారు.
ఇంతకీ ఎందుకు మీరిలా చేస్తున్నారని ప్రశ్నిస్తే.. వారి నుంచి వచ్చే సమాధానాల వెనక ఉన్న బాధ, బాధ్యత బయటికి వస్తున్నాయి. ఇదంతా విన్నవారికి.. చూసిన వారికీ ఆవేదన కలిగిస్తున్నాయి.
కన్న బిడ్డల నిర్లక్ష్యం ఓ వైపు.. ప్రేమ ఉన్నా తల్లిదండ్రులను చూసుకోలేని పిల్లలు మరోవైపు.. బిడ్డలకు భారం కాకూడదని భావిస్తున్న ఈ వృద్ధులంతా ఇంకోవైపు. ఇలాంటి పరిస్థితుల్లో.. సమాజంపై తమకున్న బాధ్యతతోనే ఇలా వేదిక ఏర్పాటు చేశామని వృద్ధ కారుణ్య మరణార్థుల సంఘ బాధ్యులు చెప్పారు. వృద్ధులకు పింఛన్లతో ఏటా వేల కోట్లు వృథా చేయాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. తమకు మరణ భిక్ష పెడితే దేశానికి మంచి జరుగుతుందంటూ.. తమ వాదనను సమర్థించుకుంటున్నారు.
ఇదీ చదవండి: