ETV Bharat / state

హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది: అశోక్‌ - ysrcp

వైకాపా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాలరాస్తోందని మాన్సాస్ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌గజపతి రాజు విమర్శించారు. దేవాలయాలకు కేటాయించిన నిధులు ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయాలన్నారు. దేవాలయాల నిధులు ఇతర కార్యక్రమాలకు వాడకూడదని స్పష్టం చేశారు. సంప్రదాయం ప్రకారమే ఆలయాల్లో నియామకాలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

ashok gajapathi raju
ashok gajapathi raju
author img

By

Published : Dec 23, 2021, 12:51 PM IST

అశోక్‌గజపతిరాజు

హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని మాన్సాస్ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు ఆరోపించారు. రామతీర్థం వద్ద సంప్రదాయంగా జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ..వాళ్ల ఇష్టం వచ్చినట్లు చేశారని మండిపడ్డారు. దేవాలయాల నిధులు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉన్నా..దాన్ని అనుసరించడం లేదన్నారు. ప్రశ్నించిన తనపై కక్షగట్టి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

'ట్రస్ట్‌ల ఆచారాలు, సంప్రదాయాలను అందరూ పాటించాలి. రామతీర్థంలో నిన్న జరిగిన ఘటన విచిత్రంగా ఉంది. శంకుస్థాపనలో సంప్రదాయం పాటించకపోవడం చూసి బాధ కలిగింది. వైకాపా ప్రభుత్వానికి నాపై ప్రత్యేక దృష్టి ఉంది. ఆలయానికి వాడుతున్న రూ.3 కోట్ల నిధులు ప్రభుత్వ ధనం కాదు. పూజా కార్యక్రమాలకు అడ్డు తగిలితే నాపై చర్యలు తీసుకోవచ్చు. హిందూ ధర్మం ప్రకారమే ఆలయాలకు విరాళాలు తీసుకుంటారు. ఆలయాల నిధులను ఈ ప్రభుత్వం ఇతర పనులకూ వాడుతోంది. మాన్సాస్ ట్రస్ట్‌ మాజీ ఛైర్మన్‌కు రూ.70 వేలు అలవెన్స్ ఇచ్చారు.' -మాన్సాస్ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు

ఇదీ చదవండి:

Ashok Fires On Govt: రామతీర్థం బోడికొండపై ఉద్రిక్తత.. రామాలయ శంకుస్థాపనలో తోపులాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.