గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను విశాఖ జిల్లా పాయకరావుపేట ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి 140 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని విశాఖ మన్యం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తాండవ కూడలి వద్ద నిదింతులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.నిందితులు హైదరాబాద్కు చెందిన సియాజ్ మహ్మద్, మహ్మద్ బజాజ్, షేక్ అమీర్లుగా గుర్తించమన్నారు. వారిని కోర్టులో రిమాండ్ చేసినట్టు తెలిపారు.
ఇదీ చదవండి... భీమవరంలో భారీ కుంభకోణం.. బ్యాంకులకు 370 కోట్లు ఎగవేత