కొండల్లో, గుట్టల్లో, గడ్డ కట్టే చలిలో వారు మనల్ని, మన దేశాన్ని కాపాడుతున్నారు. ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో దేశం పోరాడుతోంది. ఆ యుద్ధంలో మేము సైతం అంటూ ముందుకు వచ్చారు సైనికులు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపువలస పరిసర ప్రాంతాల ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛందంగా విధులు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ... రవాణా సౌకర్యం లేక కొందరు ఆర్మీ జవాన్లు ఇంటి వద్దనే ఉండిపోయారు. వీరంతా స్థానిక పోలీసుల అనుమతి తీసుకొని కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కృషి చేస్తున్నారు. వీరితోపాటు మాజీ సైనికులూ ముందుకు వచ్చారు. దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూడటం, ప్రజలు రోడ్లపైకి రాకుండా చూస్తున్నారు.
మొదట్లో ఐదుగురు జవాన్లతో ప్రారంభమైన ఈ స్వచ్ఛంద సేవ.. ఇప్పుడు సుమారు 50 మందితో కొనసాగుతోంది. తాము పుట్టి పెరిగిన ప్రాంతాల ప్రజలకు సేవచేసే అదృష్టం వచ్చిందని జవాన్లు గర్వంగా చెబుతున్నారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ వేళ బలమైన బంధాలకు ఇదే దారి!