ETV Bharat / state

అభివృద్ధికి ఆమడ దూరంలో ఆ ప్రాంతాలు

విశాఖ నగరం చుట్టుపక్కల చాలా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. వర్షాలొస్తే చాలు ఆ ప్రాంతాలోని రోడ్లు, బజార్లు బురదమయం అవుతున్నాయి. వర్షం లేకుంటే బాగుంటాయా అంటే అదీ లేదు.. దుమ్ముతో అధ్వానంగా కనిపిస్తాయి. అంతేకాదు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యమూ లేదు.

విశాఖ నగరం చుట్టు పక్కల ప్రాంతాలు
విశాఖ నగరం చుట్టు పక్కల ప్రాంతాలు
author img

By

Published : Sep 4, 2021, 4:33 AM IST

అభివృద్ధికి ఆమడ దూరంలో విశాఖ నగరం చుట్టు పక్కల ప్రాంతాలు

"ఇన్నాళ్లు కార్పొరేటర్లు లేరు, ఇప్పుడొచ్చారు.. ఇక మా ప్రాంతాలకు మౌలిక వసతులు తెచ్చిపెడతారనుకున్న శివారు వార్డు జనాల ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. ఏళ్ల తరబడి వ్యథ అనుభవిస్తున్నా.. ఆ వేదన ఇప్పటికీ అలాగే ఉంది. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని శివారు వార్డుల్లో, విలీన గ్రామాల్లో ఇప్పటికీ దయనీయ పరిస్థితులున్నాయి. బురద రోడ్లు, ఇంటిముందే పారే మురుగు, శుద్ధిలేని నీరు, వెలగని వీధిదీపాల మధ్యే బతుకును తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది" అని అంటున్నారు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు.

విశాఖ నగర చుట్టుపక్కల శివారు జోన్లలోని 48 వార్డుల్లో 23 వార్డులు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఇవన్నీ చాలావరకు విలీన ప్రాంతాలే. నగరం లోపలున్నట్లుగా అంతర్గత రోడ్లు, కాలువలు, ఇతర వసతులు ఈ వార్డుల్లో కనిపించడంలేదు. ‘వర్షాలొస్తే బురద, ఎండొస్తే దుమ్ము’ అన్నట్లుంది అక్కడి మట్టితో నిండిన వీధుల పరిస్థితి.

"డ్రైనేజీ కాల్వలు అస్సలు బాగోలేవు. చెత్త సమస్య ఉంది. చెత్త బండి వస్తే ఇంటి పైనుంచే చెత్తను విసిరేస్తారు"

-రాజేశ్వరి, వాంబే కాలనీవాసి

ఐటీ, వాణిజ్యపరంగా వేగంగా విస్తరిస్తున్న మధురవాడ జోన్‌లో వీధుల్లో తిరిగేందుకు స్థానికులు ఎన్నో కష్టాలు పడాల్సివస్తోంది. కొన్నిప్రాంతాలకు రోడ్లు వచ్చినా చాలాప్రాంతాలకు మట్టిరోడ్లే ఉన్నాయి. కాలువలు కట్టినచోట్ల డిజైన్‌ లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఏఎస్‌ఆర్‌నగర్, కొమ్మాది తదితర ప్రాంతాల్లో ఈ లోపాలున్నాయి. ఈ జోన్‌లోని చాలాప్రాంతాల్లో అసలు కాలువలనేవే కనిపించడం లేదు. అపార్ట్‌మెంట్ల చుట్టుపక్కల, ఖాళీస్థలాల్లోనే మురుగు వెళ్తోంది. సుభాష్‌నగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధిదీపాల మరమ్మతులకూ ఎవరూ రావట్లేదు.

ఈ కాలనీ ఐదు సంవత్సరాల క్రితం ఎట్లా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వర్షాకాలం వస్తే అంతా బురద మయం అవుతోంది. చాలా మంది జారీ పడ్డారు కూడా. ఎన్నిసార్లు అధికార్లకు విన్నవించుకున్నా పరిస్థితి మారలేదు. ఏవో చిన్నచిన్న పనులు చేశారు.

-వెంకటేశ్వరరావు, ఏఎస్​ఆర్​ నగర్​ కాలనీవాసి

గాజువాక జోన్‌లోని మురికివాడల్లో 12కోట్ల రూపాయలతో మౌళికవసతులకు టెండర్లు పిలిచారు. కానీ బిల్లులు రావడంలేదనే కారణంతో గుత్తేదారులు అక్కడి సీసీరోడ్లు, కల్వర్టులు, కాలువల్ని కట్టకుండానే విరమించుకున్నారు. ఈ జోన్‌లోని శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ అంతర్గతరోడ్లు లేకపోవడం, కాలువలు రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. పెదగంట్యాడ దయాల్‌నగర్, బీసీరోడ్‌ మధ్యనున్న కాలువ పాడైపోవడంతో వర్షపునీరంతా రోడ్డుమీదకే వచ్చేస్తోంది. చినగంట్యాడు జగ్గుసెంటర్‌ నుంచి గొంతెనవానిపాలెం మీదుగా వంటిల్లుజంక్షనకు వెళ్లే రోడ్డులోనూ ఇలాంటి దుస్థితే ఉంది. గాజువాకజోన్‌లోని విలీన పంచాయతీలైన దేవాడ, పాలవలస, అప్పికొండ, చినపాలెం, కేఎన్‌పాలెంలో సరైన పైపులైను నెట్‌వర్కు లేక ఇప్పటికీ ట్యాంకర్లతోనే తాగునీరు తెస్తున్నారు. మరోపక్క భూగర్భజలాలు అడుగంటడంతో ఇక్కడి ప్రజలు వేదన అనుభవిస్తున్నారు.

వేపగుంట జోన్‌ ప్రజల బాధ వర్ణనాతీతం. అక్కడి లక్ష్మీపురం, చినముషిడివాడ, సుజాతానగర్, పురుషోత్తపురం తదితర ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. వీటితో పాటు వరలక్ష్మినగర్, వేపగుంట, నాయుడుతోట, రవినగర్, శ్రీనివాస్‌నగర్, గణేష్‌కాలనీ తదితరప్రాంతాల్లో మట్టిరోడ్లపైకి వర్షపునీరు చేరి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల కార్లు, ద్విచక్రవాహనాలు దిగుబడిపోతున్నాయి. ఈ రోడ్లపై ఒలింపిక్‌లోలాగా పోల్‌వాల్ట్‌ క్రీడలు ఆడుకోవచ్చంటూ కొందరు నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే వేపగుంట జోన్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కలుషితనీరు సరఫరా అవుతోంది. శివారు, కొండవాలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వాహణ బాగోలేదు. ఇక్కడి పద్మావతీనగర్‌లో 15రోజులుగా వీధిదీపాలు వెలగడం ఆగిపోయాయి. ఫిర్యాదులు ఇచ్చినా జీవీఎంసీవారు కదలడంలేదు.

జీవీఎంసీ పరిధిలోని 98 వార్డుల్లో వార్డు డెవలప్​మెంట్​​ ప్లాన్​ వేశాము. పూర్తిగా అన్ని విధాలుగా వార్డులు అభివృద్ధి చేయడం కోసం ప్రణాళిక వేశాము. ఇందు కోసం అన్ని వార్డులకు కలిపి దాదాపు రూ. 1200కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాము.

-డాక్టర్‌ జి.సృజన, జీవీఎంసీ కమిషనర్‌

భీమిలి విలీనగ్రామాలు కాపులుప్పాడ, కె.నగరపాలెం, చేపలుప్పాడ, నిడిగట్టు, జె.వి.అగ్రహారంలో మౌళికవసతులవైపు అధికారులు దృష్టిపెట్టలేదు. రోడ్లు, కాలువలు, తాగునీరు, వీధిదీపాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అనకాపల్లిలో రోడ్ల నిర్వాహణ ఏమాత్రం బాగోలేదు. ఇక్కడి ఆర్‌అండ్‌బీ రోడ్లను జీవీఎంసీకి అప్పగించాల్సి ఉండగా ఈ ప్రక్రియ కొన్నేళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. భీమిలి, అనకాపల్లి జోన్లలోని ప్రజలకు శుద్ధిజలాలు ఇచ్చే ప్రయత్నాలు పూర్తిస్థాయిలో జరగడం లేదు.

ఇదీ చదవండి:TDP protest: 'తొలగించిన పింఛన్లను తక్షణమే పునరుద్ధరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.