విశాఖ జిల్లా ఆంధ్ర ఊటీ అరకు లోయలో నిర్వహిస్తున్న 'అరకు ఉత్సవ్ 2020' హుషారుగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిస్తున్నాయి. బోండా డాన్స్‌తో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. శివారెడ్డి మిమిక్రీతో పాటు సంగీత విభావరి తదితర కార్యక్రమాలు ప్రేక్షకుల మదిని కట్టిపడేస్తున్నాయి. కొయ్యూరు పాఠశాలకు చెందిన గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన మల్ల కంభం అందరిని ఆశ్చర్యంలో మచ్చెత్తింది.
ఇదీ చదవండి: విశాఖలో 'భీష్మ' చిత్రబృందం సందడి