విశాఖ మన్యం కొయ్యూరులో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పర్యటించారు. కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తున్న కేంద్రానికి వెళ్లి పరిశీలించారు. పీపీఈ కిట్ ధరించిన ఎంపీ... పలువురు బాధితులతో మాట్లాడారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. గ్రామంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని...తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు. భౌతికదూరం పాటించాలని..జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. కరోనా బాధితుల పట్ల వివక్ష తగదని అన్నారు.
ఇదీ చదవండి
రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది: సోము వీర్రాజు