రాష్ట్రంలో అర్హులైన ప్రతీ జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డు మంజూరుకు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లో పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయనకు ఏపీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రిడిటేషన్ కార్డులను దశలవారీగా పొడిగిస్తూ వచ్చామని అన్నారు. నూతన అక్రిడిటేషన్ కార్డు ఇచ్చే విషయాలను సమాచార శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ...అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు విషయంలో తమ వంతు కృషి చేస్తామన్నారు.
'అర్హులైన ప్రతి జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డు మంజూరుకు కృషి చేస్తా' - Deputy Chief Minister Minister Dharmana Krishnadas
రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డు మంజూరుకు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రిడిటేషన్ కార్డులను దశలవారీగా పొడిగిస్తూ వచ్చామని ఆయన అన్నారు