విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఆఖరివిడత చందనం అరగదీత ప్రారంభించారు. వచ్చే నెల 5వ తేదీన ఆషాఢ పౌర్ణమి రోజు స్వామికి చందన సమర్పణ జరగనున్నది. స్వామివారికి సుమారు 125 కేజీల చందనం సమర్పించనున్నారు. దీంతో స్వామి పూర్తి చందనస్వామిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు చందన అరగతీస్తున్నారు.
ఇదీ చదవండి: నన్ను తప్పించేందుకు స్కెచ్ వేశారు: ఈటీవీ భారత్తో రఘురామకృష్ణరాజు