మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఆయన నివాసంలో.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ స్నేహ పూర్వకంగా కలిశారు. అనంతరం అల్పాహార విందు స్వీకరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ ఉద్యమం ఇతర రాజకీయ పరిణామాలపై చర్చించారు.
గంటా శ్రీనివాసరావు తనకు మంచి మిత్రుడని.. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయటం ప్రశంసనీయం అని శైలజానాథ్ కొనియాడారు. విశాఖ ఉక్కు ఉద్యమంపై గంటా పోరాటానికి సంఘీభావం తెలిపారు.
ఇదీ చదవండి:
'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'.. నిరంతర స్ఫూర్తి రగిల్చే నినాదం