యూనిటీ కళాశాలలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 22 ఏళ్ల అభిషేక్ లలితానగర్‌లోని వీకే గ్రాండ్ అపార్టుమెంటులో తల్లి శ్వేతా మాధురి, సోదరుడితో కలసి ఉంటున్నాడు. తండ్రి శశిభూషణ్‌కుమార్ ఉద్యోగ రీత్యా బంగ్లాదేశ్‌లో ఉన్నారు. సోమవారం రాత్రి భోజనం చేసి అంతా పడుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు పెంపుడు కుక్కలు అభిషేక్ గది వద్దకు వచ్చి తీవ్రంగా మొరిగాయి. ఇంట్లో వాళ్లంతా లేచి చూసే సరికి ఘోరం జరిగిపోయింది.
తన గదిలోపలే ఫ్యాన్‌కు హుక్కుకు చీరతో ఉరివేసుకొని అభిషేక్ బలవన్మరణం చెందారు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని కిందికి దింపేసరికే మృతి చెందినట్టు గుర్తించారు. విషయాన్ని బంధువులకి తెలిపి పోలీసులకి సమాచారం అందించారు. ఇటీవల కాలంలో ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ప్రేమ విఫలం కావడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు చెబుతున్నారు.
ఇవీ చదవండి