- పింఛన్ల సొమ్ములో నకిలీ నోట్లు.. ఎక్కడంటే
పింఛన్ల పంపిణీ సమయంలో నకిలీ నోట్లు రావడంతో ప్రజలు షాక్ అయ్యారు. వెంటనే వాలంటీరుకు సమాచారం ఇవ్వగా.. వాటిని పరిశీలించారు. ఇలా మొత్తం ఎవరెవరి దగ్గర ఉన్నాయో.. వాళ్లందరి దగ్గర నుంచీ వాటిని తిరిగి తీసుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో చోటు చేసుకుంది. మొత్తం 38 నోట్లను గుర్తించారు.
- తిరుపతి జిల్లాలో దారుణం.. యువకుడిని గొంతు కోసి చంపిన దుండగులు
తిరుపతి జిల్లాలో యువకుడ్ని దుండగులు కత్తిలో పొడిచి గొంతుకోసి హత్య చేశారు. అందరూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా.. నిందితులు మాత్రం పథకం ప్రకారం మృతుడ్ని హత్య చేశారు. విద్యుత్ తొలగించి మరీ ఇంట్లొకి చొరబడి దారుణంగా హత్య చేశారు.
- 'గడప గడపలో' తొడగొట్టిన స్పీకర్ తమ్మినేని
బూర్జి మండలంలో నూతనంగా నియమించిన గ్రామ వాలంటీర్ల నియామకం కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ.. ప్రజలు ఏమనుకుంటున్నారో వివరించారు. అంతేకాదు తొడగొట్టి మరీ ఓ విషయం చెప్పారు. అది ఏంటంటే.. !
- 'ఎకరాకు రూ.25 లక్షలివ్వండి.. అన్నీ నేను చూసుకుంటా'
ఆలయ భూములను కూడా వదిలే విధంగా లేరు ఆక్రమణదారులు. వీరితో ఓ ప్రజాప్రతినిధి చేయి కలిపాడు. ఇంకేం ఉంది.. అధికారులపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అనధికార మార్గంలో ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కవులూరులో సంతాన వేణుగోపాలస్వామి దేవాలయ భూములను తన సొంతం చేసుకోవాలనుకున్నారు.
- పట్టపగలే మహిళను కిడ్నాప్ చేసేందుకు యత్నం.. ఆ తర్వాత ఏ జరిగిందంటే..
జిమ్ నుంచి తిరిగి వస్తున్న ఓ మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. ఆ మహిళ కారులో నలుగురు వ్యక్తులు బలవంతంగా ఎక్కారు. మహిళ ప్రతిఘటించడం వల్ల నిందితులు పారిపోయారు. ఈ ఘటన హరియాణాలోని యమునా నగర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ కారును పోలీస్ స్టేషన్‌కు తరలించి నిందితుల వేలి ముద్రలు సేకరించారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ కమల్‌దీప్ సింగ్ తెలిపారు.
- బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి పంత్ దూరం.. వికెట్ కీపర్‌గా వారిద్దరికీ ఛాన్స్!
పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడటం వల్ల అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్లను ఎంచుకోవడం ఇప్పుడు సెలెక్షన్ కమిటీకి సవాలుగా మారింది. దీంతో అతన్ని రిప్లేస్ చేసే వ్యక్తి కోసం కమిటీ సన్నాహాలు చేస్తోంది.
- అప్పట్లో 70% పిల్లలకు కరోనా ముప్పు!
ఒమిక్రాన్ ఉద్ధృతికి ముందు 50 నుంచి 70% మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడే ముప్పు ఎదుర్కొన్నారని ఓ అధ్యయనంలో తేలింది. మరింత సమర్థమైన టీకాలను రూపొందించి, ఇంకా ఎక్కువమందికి ఇవ్వాల్సిన అవసరాన్ని ఇది చాటుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు.
- వంట గ్యాస్ ధర పెంపు.. సిలిండర్‌కు ఎంతంటే..
వంట గ్యాస్ ధర మరోసారి పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధరను రూ.25మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో దిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,769కి చేరింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.
- 'యాంకరింగ్‌కు గుడ్‌బై.. ఇక ఫ్యామిలీకే అంకితం'.. సుమ బిగ్ ట్విస్ట్
ఇటీవలే యాంకర్ సుమ ఓ షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించారు. తాను ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉండాలనుకుంటున్నానని ఓ షో ప్రోమోలో తెలిపారు. అయితే కొన్ని రోజులకే మళ్లీ ఆ మాటలు నిజం కావని ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. కాసేపటికే దాన్ని కూడా డిలీట్ చేశారు. చివరకు.. తన రిటైర్మెంట్పై తాజాగా ఓ షోలో క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే ??