- ఉరవకొండలో వైసీపీ నాయకులతో కుమ్మక్కు.. టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగింపు
TDP Votes Removing With Volunteers In Anantapur District: వైసీపీ నాయకులతో కుమ్మక్కై, వాలంటీర్ల సహకారంతో టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించిన ఉదంతం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుంచి టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కొందరు బీఎల్వోలు తొలగించారని నేతలు మండిపడ్డారు.
- జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ సక్సెస్
EMERGENCY LANDING TRAIL RUN SUCCESS : బాపట్ల జిల్లా కొరిశపాడు సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రన్‌వేపై.. విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. భారత వాయుసేనకు చెందిన నాలుగు విమానాలు రన్‌వే మీదుగా ప్రయాణించి.. కాస్త ఎత్తు నుంచే టేకాఫ్ అయ్యాయి. రన్‌వే విమానాల అత్యవసర ల్యాండింగ్‌కు పూర్తి అనువుగా ఉందని.. వాయుసేన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
- కందుకూరులో జరిగిన ఘటన దురదృష్టకరం: పవన్
JANASENA PAWAN ON KANDUKURU INCIDENT : చంద్రబాబులో బహిరంగ సభలో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం బాధాకరం అన్నారు.
- కందుకూరు ఘటన మనసును తీవ్రంగా కలచివేసింది: ఎమ్మెల్యే బాలకృష్ణ
MLA Balakrishna, Yanamala emotional on Kandukur incident: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో గతరాత్రి నిర్వహించిన బహిరంగ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన తమ మనసును తీవ్రంగా కలచివేసిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విచారం వ్యక్తం చేశారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడేను మోయాల్సి రావడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
- '2020 నుంచి 113 సార్లు సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను రాహుల్ ఉల్లంఘించారు'
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పూర్తి భద్రత కల్పించామని.. కానీ ఆయనే భద్రతా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దిల్లీలో జరిగిన భారత్ జోడో యాత్రలో భద్రతాలోపాలు బయటపడ్డాయని కాంగ్రెస్ ఆరోపించిన మరుసటిరోజే ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.
- ప్రేయసితో కలిసి హోటల్‌కు వెళ్లిన యువకుడి అనుమానాస్పద మృతి
దిల్లీలోని ఓ హోటల్ గదిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా తేలినప్పటికి అతను మృతి చెందిన విధానం పలు అనుమానాలకు దారి తీస్తోందని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని ఓ కుటుంబాన్ని గ్రామస్థులు వెలివేశారు.
- దగ్గు మందుకు 18 మంది పిల్లలు బలి!.. భారత్‌లో ఔషధం ఉత్పత్తి బంద్.. దర్యాప్తు ముమ్మరం
ఉజ్బెకిస్థాన్‌లో దగ్గు మందు తాగి 18 మంది పిల్లలు మరణించిన ఘటనపై భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దగ్గు మందు తయారీని నిలిపివేసి, దర్యాప్తు ప్రారంభించింది. నమూనాలను చండీగఢ్ డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీకి అధికారులు పంపారు. మరోవైపు ఈ ఘటనపై భాజపా, కాంగ్రెస్ మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం జరిగింది.
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. షాకయ్యా!: సూర్య
భీకరమైన ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని అన్నాడు. ఇంకా ఏం అన్నాడంటే..
- అందులో అవినీతి జరిగిందో లేదో తెలీదు.. నాకు పెద్దరికం వద్దు: చిరు
పెద్దరికం అనుభవించాలని లేదని, తనకు ఎలాంటి కుర్చీలు వద్దని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. కళాకారుల సంక్షేమం కోసం తానెప్పుడూ ముందుంటానని తెలిపారు.