- లోకేష్ పాదయాత్రకు "యువగళం" పేరు ఫిక్స్.. జెండా ఆవిష్కరించిన నేతలు
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల 27న కుప్పం నుంచి ఆయన మహా పాదయాత్రగా జనక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. లోకేష్ మహా పాదయాత్రకు "యువగళం" పేరును పార్టీ ఖరారు చేసింది. NTR భవన్లో.. యువగళం జెండాను పలువురు నాయకులు ఆవిష్కరించారు.
- సంతానం కలగలేదని.. భార్య కాలు, చేయి విరిచిన భర్త..!
వివాహం జరిగి మూడేళ్లు కావస్తున్నా పిల్లలు పుట్టడం లేదని భార్యపై విచక్షణరహితంగా దాడి చేశాడో ప్రభుద్దుడు. అంతటితో ఆగకుండా.. ఆమె కాళ్లు, చేతులను విరిచేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తమ కుమార్తెపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన భర్త, ఆయన కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
- పోలీసులతో యువకుడి వాగ్వాదం.. చెప్పు చూపెట్టిన ఎస్సై.. వీడియో వైరల్
వైఎస్సార్ జిల్లాలో.. నంద్యాల జిల్లాకు చెందిన పోలీస్ అధికారుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వాహనం నిలిపే విషయంలో యువకుడితో ఘర్షణకు దిగిన ఎస్సై చేతిలో చెప్పు ఉన్న సీసీ ఫుటేజీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- శ్రీశైలంలో దుకాణాల కేటాయింపు, కూల్చివేతలపై సానుకూలంగా స్పందించండి: హైకోర్టు
నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం ఈవో ఎస్.లవన్న హైకోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ పిటిషనర్లకు చెందిన 24 దుకాణాలను ఈనెల 20న కూల్చివేసిన కేసులో హైకోర్టు ఈవో హాజరుకావాలని గత విచారణలో ఆదేశించింది. దుకాణాలు కేటాయింపు కోసం దేవస్థానానికి వినతి సమర్పించుకోవాలని న్యాయమూర్తి పిటిషనర్లకు సూచించారు. ఆ వినతిపై సానుకూలంగా స్పందించాలని ఈవోకు న్యాయమూర్తి స్పష్టంచేశారు. విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.
- 'దేశ ప్రజలను విద్వేషాలతో విడగొడుతున్నారు'.. కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో ఖర్గే
దేశ ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతుంటే.. ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా విద్వేషాలను రాజేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.
- ఆర్థిక సంక్షోభంలో పాక్.. అమెరికాలోని ఎంబసీ ఆస్తులు అమ్మకం!
అమెరికాలోని తమ ఎంబసీ ఆస్తులను అమ్మేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది. వాషింగ్టన్లో ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు ముందుకొచ్చినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
- స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- ధోనీ కుమార్తెకు స్పెషల్ గిఫ్ట్ పంపిన మెస్సి.. ఏంటంటే?
ఫిఫా వరల్డ్ కప్ 2023 టైటిల్ నెగ్గిన ఆనందంలో మునిగి తేలుతున్న మెస్సి తన అభిమానులు, ఫాలోవర్లను మాత్రం మరిచిపోలేదు. అయితే తాజాగా అతడు ధోనీ కూతురు జీవాకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.