రానున్న రోజుల్లో విశాఖలో పెట్టుబడులకు మరింత అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన భారత్ - అమెరికా రక్షణ రంగ సంబంధాల సదస్సులో పాల్గొన్న ఆయన.. విశాఖను కార్య నిర్వాహక కేంద్రంగా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. ఈ సదస్సులో రక్షణ రంగానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఏపీకి 900 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉండటం... రక్షణ రంగ పెట్టుబడులకు కలిసొచ్చే అంశంమని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత పెట్టుబడులు పెట్టటానికి విశాఖను ఎంచుకునే వారని.. కానీ గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖకు భారీగా పెట్టుబడులు తరలివస్తాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: