కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్లో భాగంగా ఒడిశా నుంచి ఆంధ్రాకు రాకపోకలు నిలిపివేశారు. పోలీసులు ఆంధ్ర సరిహద్దులో వాహనాలు అడ్డుకున్నారు. అలాగే సీలేరు జలాశయం వద్ద ఒడిశా వెళ్ళే దారిలో ఉన్న గేటుకు తాళం వేశారు. అత్యవసర పని మీద వచ్చే వారిని పరిశీలించి పంపిస్తున్నారు. ఈనెల 31 వరకు బయటి నుంచి వచ్చే వాహనాలు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: