ETV Bharat / state

ఉద్యోగం పేరిట రూ.12 కోట్లు మోసం చేసిన నూతన్ నాయుడు! - case on nuthan naidu

నూతన్ నాయుడు లీలలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఎస్​బీఐలో ఉద్యోగం ఇప్పిస్తానని.. రూ.12 కోట్లు తీసుకొని.. నూతన్ నాయుడు మోసం చేశాడని విశాఖ మహారాణిపేట పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు అయ్యింది.

another case filed on nuthan naidu
నూతన్ నాయుడుపై మరో కేసు
author img

By

Published : Sep 14, 2020, 9:57 PM IST

విశాఖ దళిత యువకుడి శిరోముండనం కేసులో నిందితుడైన నూతన్ న్యాయుడిపై చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు.. విశాఖ నగర శాంతిభద్రతల డీసీపీ-1 ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. ఎస్​బీఐలో సౌత్​ రీజనల్​ డైరెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నూతన్ నాయుడు రూ.12 కోట్లు తీసుకున్నట్లు.. మహారాణిపేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైనట్లు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితుడు విడతల వారీగా బ్యాంకులో జమ చేసిన స్టేట్​మెంట్​లతో విచారణ చేస్తున్నామనీ.. అవసరమైతే నూతన్ నాయుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆదుకోవాలని నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.