విశాఖ మన్యం మీదుగా అక్రమంగా పశువుల్ని తరలిస్తున్న వాహనాన్ని నర్సీపట్నంలో భారతీయ జనతా పార్టీ నాయకులు గాదె శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు.
![animals illegal transport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vzm-15-19-akramapasu-ravaana-vzm-10158_19092020184006_1909f_1600521006_133.jpg)
విశాఖ మన్యం మీదుగా సీలేరు, భద్రాచలం, ఖమ్మం రోడ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు భాజపా నేతలు వివరించారు. అడ్డుకున్న ఈ వాహనాల్లో సుమారు 45 పశువులు ఉన్నట్లు నేతలు వివరించారు. వాహనాలను పోలీసులకు అప్పగించి.. నిందితులపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అక్రమంగా పశువులు తరలింపు