ఆంధ్ర విశ్వవిద్యాలయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ జరుగుతుండడం ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న కొందరు విద్యార్థుల అవకాశాల్ని దెబ్బతీస్తోంది. దేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఇంకా డిగ్రీ ఫలితాలను ప్రకటించలేదు. ఆయా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న కొందరు ఆసెట్ రాసి మంచి ర్యాంకులు సంపాదించుకున్నారు. కొందరికి ఏయూలోనే పీజీ సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ డిగ్రీ ఉత్తీర్ణులైనట్లు ప్రొవిజనల్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలని ఏయూ అధికారులు సూచించడంతో ఇతర విశ్వవిద్యాలయాల విద్యార్థులకు దిక్కుతోచని స్థితి ఎదురవుతోంది. అప్‌లోడ్ చేసిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి సీటు కేటాయిస్తామని తేల్చి చెబుతుతుండడంతో బాధిత విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో కొన్ని విశ్వవిద్యాలయాల పరీక్ష ఫలితాలు విడుదల చేయకపోవడంత తమకు శాపంలా మారిందని కంటతడిపెడుతున్నారు. ప్రత్యామ్నాయం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏడో తేదీ వరకు అవకాశం ఉంది....
ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు ఫలితాలు రాక ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి వారు ఈనెల ఏడో తేదీకల్లా వారి పత్రాలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత కూడా ఆలస్యమైతే చేసేదేమీలేదు. అర్హత పత్రాలు సమర్పించకుండా సీట్లు కేటాయించడం, రిజర్వు చేయడం నిబంధనలకు విరుద్ధం. ప్రవేశాలు ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూలు వాయిదావేస్తే విద్యాసంవత్సరం మరింత ఆలస్యమవుతుంది - ఆచార్య డి.ఎ.నాయుడు, సంచాలకులు, ఏయూ ప్రవేశాల విభాగం
ఇదీ చదవండి: