ETV Bharat / state

బలిమెల జలాశయ నీటి పంపకాలపై ఆంధ్రా - ఒడిశా అధికారుల చర్చ - బలిమెల జలాశయం నీటి వినయోగం న్యూస్

వ‌ర్షాలకు వస్తున్న నీటి నిల్వ‌ల‌ను అందిపుచ్చుకుని వాటిని నిల్వ‌చేయాల‌ని, ఇరురాష్ట్రాలు అవ‌స‌రాల‌కు అనుగుణంగా నీటి విడుద‌ల‌కు స‌హ‌క‌రించుకోవాల‌ని ఆంధ్రా-ఒడిశా అధికారులు నిర్ణ‌యించారు. బ‌లిమెల జ‌లాశ‌యం నిర్వ‌హ‌ణ‌, నీటి వాడ‌కంపై 6 నెలల తర్వాత సీలేరు అతిథిగృహంలో స‌మీక్షించారు.

బలిమెల జలాశయ నీటి వాడకంపై ఆంధ్రా-ఒడిశా అధికారుల భేటీ

author img

By

Published : Sep 9, 2020, 10:31 PM IST

బ‌లిమెల జ‌లాశ‌యంలో నీటి నిల్వ‌లు, వాడ‌కంపై ఆంధ్రా - ఒడిశా అధికారులు చ‌ర్చించారు. ప్ర‌స్తుతం జలాశయంలో ఉన్న నీటి నిల్వ‌ల‌తో విద్యుత్​ కేంద్రాల‌కు ఎటువంటి నీటి స‌మ‌స్య లేకుండా స‌మ‌న్వ‌యంతో వ్యవహరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం బ‌లిమెల జ‌లాశ‌యంలో 61.58 టీఎంసీల నీరుండ‌గా, జోలాపుట్‌లో 22.69 టీఎంసీల‌తో మొత్తం 84.27 టీఎంసీలు నీరుంది.

న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల నుంచి 15 టీఎంసీలు నీరు చేరే అవ‌కాశ‌ముంద‌ని... 2 జ‌లాశ‌యాల్లో 99.27 టీఎంసీలు నీరు నిల్వ ఉంటుందని అధికారులు లెక్క‌లు గ‌ట్టారు. ఇందులో ఏపీ జెన్‌కో 42.17 టీఎంసీలు వాడుకోవ‌డానికి ఒడిశా 57.10 టీఎంసీలు నీటిని వాడుకోవ‌డానికి నిర్ణ‌యించారు.

వచ్చే నెల‌లో సీలేరు కాంప్లెక్స్‌లో విద్యుత్ అవ‌స‌రాల నిమిత్తం రెండు వేల క్యూసెక్క‌ులు.. ఏపీ జెన్‌కో వాడుకోవ‌డానికి ఒడిశా అవ‌స‌రాలు నిమిత్తం 4000 క్యూసెక్కులు నీరు వాడుకోవ‌డానికి పరస్పర అంగీకారానికి వచ్చారు. ఆగస్టు‌లో ఏపీ జెన్‌కో 4.95 టీఎంసీలు, ఒడిశా 8.96 టీఎంసీలు నీరు వాడుకుంది. ఆగస్టు నెల‌లో ఒడిశా అద‌‌నంగా 4.01 టీఎంసీలు వాడుకుంది.

ఇదీ చదవండి:

అంగన్వాడీల రూపురేఖలను మార్చబోతున్నాం: జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.