అండమాన్ నికోబార్ దీవుల నేవీ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే... తూర్పు నౌకాదళ మూడు రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పాండేతో భేటీ అయ్యారు. రెండు కమాండ్ల మధ్య సమన్వయం, బంగాళాఖాతంలో నౌకాదళం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.
మనోజ్ పాండే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 15వ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లో వాస్తవ అధీన రేఖ వద్ద ఇంజనీర్ బ్రిగేడ్‌లో పాండే కీలక పాత్ర పోషించారు.
పశ్చిమ లద్దాక్‌లో ఉన్నత శిఖరాల విభాగంలో ఆయన బృందాలను నడిపించడంలో విశేష కృషి చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం పలు ఆపరేషన్లలో కీలకపాత్ర నిర్వహించారు.
ప్రస్తుత జియో పొలిటికల్ పరిస్థితుల్లో అండమాన్ నికోబార్ దీవుల సముదాయం నేవీ కమాండ్, తూర్పు నౌకాదళ కమాండ్లు మధ్య పరస్పర సమన్వయం ప్రధానమైన అంశంగా మారింది. పాండేతో పాటు విశాఖను డిఫెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు అర్చన పాండే సందర్శించారు.
ఇదీ చదవండి: 'మీ వినతులు బాక్సులో వేయండి ప్లీజ్'