ETV Bharat / state

దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో చోరీ యత్నం

విశాఖ జిల్లా దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. కార్యాలయంలో రికార్డులను చిందరవందరగా పడేశారు. తహసీల్దార్​ రమేష్ బాబు ఫిర్యాదుతో పోలీసులు, క్లూస్ బృందం రంగంలోకి దిగారు. వివరాలను సేకరిస్తున్నారు.

తాశీల్దార్ కార్యాలయం
తాశీల్దార్ కార్యాలయం
author img

By

Published : Aug 31, 2021, 9:13 AM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసేందుకు యత్నించారు. తహసీల్దార్​ కార్యాలయం తాళాలతోపాటు బీరవా తెరిచి రికార్డులన్నీ చిందరవందరగా పడేశారు. సోమవారం సెలవు దినం అయినప్పటికీ కొందరు సిబ్బంది అదే రోజు మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చారు. రికార్డులు చిందరవందరగా పడేసి ఉండటంతో.. వెంటనే సిబ్బంది.. తహసీల్దార్ ​ రమేష్​బాబుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి కార్యాలయాన్ని పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవరాపల్లి ఎస్సై సింహాచలం , క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. వివరాలను సేకరించారు. పోలీసులు పలువురు సిబ్బందితో మాట్లాడారు. కార్యాలయంలో దొంగలు పడటంతో ఈ ప్రాంతంలో కలకలం రేపుతోంది.

పోలీస్​స్టేషన్​కు సమీపంలోనే..

దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్​కు కూతవేటు దూరంలో ఉంది. ఈ కార్యాలయంలో దొంగలు పడి రికార్డులను చిందరవందరగా పడేయడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ARREST: ద్విచక్రవాహనాల చోరీ ముఠా అరెస్ట్.. 76 బైక్​లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.