అనంతపురం అరటి.. ఆనందపురం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. మార్కెటింగ్ శాఖ ద్వారా సరఫరా అవుతున్న ఆకుపచ్చని అరటి పళ్ళు లాక్డౌన్ కారణంగా రవాణాలో చెడిపోతున్నాయి. అక్కడి నుంచి విశాఖకు చేరుకున్నా.. అరటిపళ్ళను ఇక్కడి వినియోగదారులు కొనుగోలు చేయని కారణంగా స్థానిక రైతు బజార్లోని వర్తకులకు రోజుకి 1000 రూపాయల చొప్పున నష్టం వస్తోంది. కిలో రూ. 40 కి అమ్ముదామని చూసినా కనీసం 10 రూపాయలకు కూడా ఎవరూ కొనడం లేదని వాపోతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు అనంతపురం అరటినే అమ్మాలని ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజులు నష్టాలు భరించామని.. ఇకపై అనంతపురం అరటిని విక్రయించలేమని రైతు బజార్లోని రైతులు చేతులెత్తేస్తున్నారు. కుప్పలుగా పోసి వదిలేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: