ETV Bharat / state

వంజంగి అందాల వీక్షణకు ప్రజాప్రతినిధులు క్యూ - కుటుంబంతో కలిసి వంజంగి పర్వతాలను సందర్శించిన అనకాపల్లి ఎమ్మెల్యే

పర్యాటకులను రారమ్మంటూ ఆహ్వానిస్తున్నట్లున్న విశాఖ జిల్లా పాడేరు మండలంలోని వంజంగి కొండలను.. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​ కుటుంబ సమేతంగా వీక్షించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

vanjangi hills
వంజంగి పర్వతాల వద్ద ఎమ్మెల్యే అమర్​నాథ్
author img

By

Published : Jan 2, 2021, 6:22 PM IST

వంజంగి పర్వతాల అందాలు

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​ కుటుంబ సమేతంగా.. విశాఖ ఏజెన్సీ పాడేరు మండలంలోని వంజంగి కొండల అందాలను వీక్షించారు. వేకువజామునే అక్కడికి చేరుకుని.. సూర్యకిరణాల్లో తేలియాడే వెండి మబ్బుల ప్రకృతి రమణీయ దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. స్థానిక గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. వారి ఉదయపు ఆహారమైన అంబలి తాగారు. కొండ ఎక్కేటప్పుడు పడిన కష్టం దిగేటప్పుడు మర్చిపోయామన్నారు. ఏజెన్సీ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా.. ఈ ప్రాంతం అభివృద్ధి గురించి పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇతర ఎమ్మెల్యేలను కలుపుకుని ఈ విషయంలో ముందుకు సాగుతామని.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్షి భర్త, రాష్ట్ర వైద్య సలహా మండలి సభ్యులు నర్సింగ్ రావు తెలిపారు.

నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా.. వంజంగి పర్వత ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎంపీ మాధవి.. రెండు రోజుల కిందటే వాటిని తిలకించారు. ఉషోదయపు వేళలో ఇక్కడి మంచు అందాలు, మేఘాలను చీల్చుకుంటూ ప్రసరిస్తున్న సూర్య కిరణాలు.. చూపరులను కట్టిపడేస్తాయి. ఇటువంటి అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయం నుంచే పర్యాటకులు బారులు తీరుతున్నారు.

ఇదీ చదవండి:

'ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.