విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కరోనాని జయించారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా కరోనాని జయించవచ్చని అమర్నాథ్ చెప్పారు. గత నెల 20న ఆయనకు కరోనా సోకినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం 29న మరోసారి పరీక్షలకు వెళ్లగా… నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో శనివారం నుంచి ఆయన ప్రజాసేవకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :