విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్స్‌లో హీరో అల్లు అర్జున్ నూతన చిత్రం పుష్ప షూటింగ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా కోసం.. సీలేరు కాంప్లెక్స్‌లోని ఫోర్బాయి జలాశయం, కెనాల్, పొల్లూరు జలపాతం పరిసరాల్లో రాత్రి వేళ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, దర్శకుడు సుకుమార్‌ను చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారికి అల్లు అర్జున్ అభివాదం చేశారు. మరో షెడ్యూల్ షూటింగ్‌ను డొంకరాయి జలాశయ ప్రాంతంలో చిత్రీకరించనున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: