జీవో నెంబర్ 3ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖలో డిమాండ్ చేసింది. గిరిజనులు గత 30 సంవత్సరాల నుంచి జీవో నెంబర్ 3 ద్వారా వందశాతం ఉద్యోగావకాశాలు పొందుతుంటే.. ఇప్పుడు ఆ జీవోను రద్దు చేయడం సమంజసం కాదని గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ పిటిషన్లు వేసింది. గత ఏడాది కాలంగా కోర్టు తీర్పును అమలు చేయకుండా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... కరోనా సెకండ్ వేవ్ కర్ఫ్యూ విధించి గిరిజనులకు వ్యతిరేకంగా ఉన్న జీవో నెంబర్ 3 ను అమలు చేయమని ఇప్పుడు ఒత్తిడి చేయడం సమంజసం కాదని గిరిజన సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అండగా నిలుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు గిరిజనులకు ప్రత్యేక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో ఉన్న 15 వేల ఖాళీ పోస్టులను గిరిజనులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ.. CM Jagan alert on rains: భారీ వర్షాలు... అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు