ETV Bharat / state

విశాఖ విమానాశ్రయంలో ఎన్​ 5 టాక్సీ ట్రాక్​పై అధికారులతో ఎంపీ సమీక్ష - n5 taxy tracks for visakhaopatnam

విశాఖ విమానాశ్రయంలో ఎన్​ 5 టాక్సీ ట్రాక్​ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎయిర్​పోర్ట్​ అధికారులను కోరారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్​ల ద్వారా 10 విమానాల రాకపోకలకు మాత్రమే అవకాశముండగా... ఈ ట్రాక్​ అందుబాటులోకి వస్తే ఆ సంఖ్య 16కు పెరుగుతుంది.

ఎన్5 టాక్సీ ట్రాక్​ల కోసం విశాఖలో ఎయిర్ పోర్ట్ సలహామండలి చర్చ
author img

By

Published : Oct 29, 2019, 1:21 PM IST

ఎన్5 టాక్సీ ట్రాక్​ల కోసం విశాఖలో ఎయిర్ పోర్ట్ సలహామండలి చర్చ

విశాఖ విమానాశ్రయంలో సిద్ధమైన ఎన్​ 5 టాక్సీ ట్రాక్​ను నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్​ పోర్ట్​ సలహా మండలి ఛైర్మన్​, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అధికారులను కోరారు. దీనికి సంబంధించిన విధివిధానాలపై ఎయిర్​పోర్ట్​ డైరెక్టర్​, ఇతర అధికారులతో... ఎంపీ సమీక్షించారు.​ ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఎన్​ 3, ఎన్​ 4 ట్రాక్​ల వల్ల గంటకు పది విమానాల రాకపోకలకు అవకాశం ఉందని... ఎన్​ 5 ట్రాక్​ కూడా అందుబాటులోకి వస్తే ఆ సంఖ్య 16కు పెరుగుతుందని అన్నారు. నూతన టాక్సీ ట్రాక్​ నిర్మాణానికి ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా దాదాపు రూ.23 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలో 14 పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఆరు కొత్తగా నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. రన్ వేను 10,100 అడుగులకు విస్తరించారు. దీనివల్ల బి 767 క్లాస్ విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేందుకు వీలవుతుంది.

ఇదీ చూడండి:

ఆ విమానాశ్రయం మరింత ఆలస్యం!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.