విశాఖ పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఇంఛార్జ్ ప్రాజెక్ట్ అధికారిగా డాక్టర్ వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన పాడేరు సబ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు పాడేరు ఐటీడీఏ పీఓగా పనిచేసిన బాలాజీ... కర్నూలు మున్సిపల్ కమిషనర్గా బదిలీ కావటంతో ఆయన స్థానంలో వెంకటేశ్వర్ నియమితులయ్యారు. ఐటీడీఏ ఏపీఓ వి ఎస్.ప్రభాకర్, పరిపాలనాధికారి కె.నాగేశ్వరరావు, ఉపసంచాలకులు జి.విజయకుమార్, వేగి అప్పారావు తదితరులు డాక్టర్ వెంకటేశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఇదీ చదవండి: