సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 352 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీలు).. 2021-22 విద్యా సంవత్సరానికి గాను.. 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తు గడువును పొడిగించారు. కొవిడ్ నేపథ్యంలో.. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువు.. జులై 5 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి తెలిపారు.
ప్రతీ కేజీబీవీలో ఆరో తరగతిలో 40 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్లు ఖాళీలను భర్తీ చేయనున్నారు. 7, 8 తరగతుల్లో ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అర్హులెవరంటే..
అనాథ, బడిబయట పిల్లలు, బడి మధ్యలో మానేసిన వారు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీపీఎల్ (దారిద్ర రేఖకు దుగువన ఉన్నవారు) బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న బాలికలు ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పెంచిన గడువులోగా.. జులై 5 తేదీ వరకు https:apkgbv.apcfss.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను మాత్రమే ప్రవేశానికి పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఆయా మండలాల్లోని సమీప కేజీబీవీలో సంప్రదించవచ్చునని అధికారులు వెల్లడించారు.
ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా మెసేజ్
ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం చేరవేస్తారని లేదా సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చుని తెలిపారు. ఏవైనా సమస్యలు, సందేహాలకు.. 9494383617, 9441270099 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఇదీ చదవండి: