విశాఖలోని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీరుగా వి.రాంబాబు బాధ్యతలు చేపట్టారు. శ్రీశైలం జలవిద్యుత్కేంద్రం ఎస్ఈగా పనిచేస్తున్న రాంబాబును పదోన్నతిపై సీలేరు కాంప్లెక్స్ సీఈగా నియమించారు. సీలేరు కాంప్లెక్స్‌లోని అధికారులు.. నూతన సీఈని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఈ.. అక్కడి ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. జలవిద్యుత్కేంద్రాల పనితీరు, యూనిట్ల నిర్వహణ, ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటి నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధిద్దామని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నాం: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ